🤝🙂🤝🙂 బాపురం భాషితాలు 🤝🙂🤝🙂 మనం భూమ్మీద పుట్టగానే కొన్ని బంధాలు ఏర్పడిపోతాయి. అనుబంధాలతో ఆ బంధుత్వాలను పటిష్టం చేసుకుంటూ ఎదగాలి. అలాగే మనం పెరిగే కొద్దీ కొన్ని బంధాలను మనమే మనస్ఫూర్తిగా ఏర్పరచుకొంటాం. వాటిని మనం స్నేహం ప్రేమ అనే సూత్రాలతో ముడివేసి ఉంటాం. ఆ బంధాలు నాజూకైనవి. అపురూపమైనవి. అవే మనకు మన జీవితాలపై ఒకింత భరోసాను రవ్వంత ఆసరాను కల్పిస్తుంటాయి. జీవితాంతం వాటిని నిభాయించుకుంటూ ఆ బంధాల ఆప్యాయతాపరిమళాలను ఆఘ్రాణిస్తూ ఉండాలి. 🤗 సర్వే జనాః సుఖినో భవంతు 04/02/2021🤗 ✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qkkthoughts #qkbaba #qyquotes #qylife