Nojoto: Largest Storytelling Platform
naraharirao2182
  • 3.1KStories
  • 1Followers
  • 1Love
    0Views

Narahari Rao

  • Popular
  • Latest
  • Video
7ad2858c12e045eb858b4a3b7dc87ebd

Narahari Rao

🌸🌸🌸 నరహరి నిత్య నిపఠము 🌸🌸🌸
4⃣3⃣9⃣

ఒక్క క్షణం గడచిపోతే అది మన జీవితాల్లో జ్ఞాపకంలా మిగిలిపోతుంటుంది.
అందుకే అంది వచ్చిన ప్రతి క్షణాన్ని  పూర్తిగా ఆస్వాదిద్దాం. 
సంతోషకర క్షణాలైతే వాటిని జీవితాంతం గుర్తుండిపోయేలా... ఎప్పుడైనా గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా మనసులో ఓ ఆనందవీచిక కదలాడే విధంగా పదిలపరచుకుందాం. 
కష్టం కలిగించే క్షణాలైతే  వాటినుండి అనుభవ పాఠాలను నేర్చుకొని ముందటి జీవితాలను తీర్చిదిద్దుకుందాం.
✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము    22- 11- 2022 #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #telugu #yqteluguquotes #yqtelugu

#జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #Telugu #yqteluguquotes #yqtelugu

7ad2858c12e045eb858b4a3b7dc87ebd

Narahari Rao

🌺🌺🌺 నరహరి నిత్య నిపఠము 🌺🌺🌺
4⃣3⃣8⃣

మనం మన కోపతాపాలను అదుపులో ఉంచుకోవాలి. 
కోపాన్ని బయటకు వెళ్ళగ్రక్కడం మన ఆరోగ్యానికి మంచిదే... కానీ అది ఎదుటివారి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అని కూడా మనకు కొద్దిగా అవగాహన ఉండాలి. 
అనవసరమైన కోపం ఎవరికీ మంచిది కాదు. 
మితిమీరిన కోపం మాత్రం అన్ని విధాలా మనకు హానికరమే కాకుండా ఆ సమయంలోని మన నోటినుండి వెలువడే మాటలు మనుషుల సంబంధబాంధవ్యాలకే ఎసరు పెట్టవచ్చు. 

✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము   21- 11- 2022 #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #telugu #yqtelugu #yqteluguquotes

#జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #Telugu #yqtelugu #yqteluguquotes

7ad2858c12e045eb858b4a3b7dc87ebd

Narahari Rao

🌸🌸🌸 నరహరి నిత్య నిపఠము 🌸🌸🌸
4⃣3⃣7⃣

నీకెవరైనా సంతోషాన్ని కలిగించే విధంగా పనులు చేస్తే నీవు కూడా వారికి సంతోషాన్ని కలిగించే పనులనే చేయి. 
సంతోషాన్ని నీకు బహుమతిగా ఇచ్చిన వారికి నీవు ఎటువంటి పరిస్థితుల్లోనూ విషాదాన్ని బహుమతిగా ఇవ్వకూడదని గుర్తుంచుకో. 
నీకు ఎవరైనా దుఃఖాన్ని కలుగజేస్తే వారికి ప్రతిగా దుఃఖాన్ని కలుగజేయాలని కోరుకోవద్దు. 
వారికి కూడా నీపరంగా సంతోషాన్ని అందజేయాలనే ప్రయత్నించు లేదా వారిని పట్టించుకోకుండా ఉండిపో... అంతేకానీ నీవు వారిలా మాత్రం దిగజారకు. 
✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము    20- 11- 2022 #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #yqteluguquotes #yqtelugu #teluguquotes #telugu

#జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #yqteluguquotes #yqtelugu #teluguquotes #Telugu

7ad2858c12e045eb858b4a3b7dc87ebd

Narahari Rao

🌸🌸🌸 నరహరి నిత్య నిపఠము 🌸🌸🌸
4⃣3⃣6⃣

జీవితంలో ఏదేని సమస్య వచ్చినప్పుడు సమస్యను సమస్యగానే చూడాలి. 
సమస్య గురించి పదే పదే ఆలోచిస్తూ ఆ సమస్యను మరింత జటిలం చేసుకోకూడదు. 
వీలైతే సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలి. 
వీలు కాకపోతే ఆ సమస్యను వదిలి వేయడం ఉత్తమం. 
అదే సమస్యను పట్టుకొని వ్రేలాడుతుంటే దాని వెనుక మరిన్ని సమస్యలు పుట్టుకొచ్చేస్తుంటాయి. 
అందుకే మన పరిధిలో పరిష్కారం కాని సమస్యలను ఎక్కడివక్కడ వదిలేయడమే మంచిది. 
✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము 19- 11- 2022 #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #telugu #yqteluguquotes #yqtelugu

#జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #Telugu #yqteluguquotes #yqtelugu

7ad2858c12e045eb858b4a3b7dc87ebd

Narahari Rao

🌸🌸🌸 నరహరి నిత్య నిపఠము 🌸🌸🌸
4⃣3⃣5⃣

మన జీవితాల్లో వెలుగు చీకటి రెండూ దాగుడుమూతలు ఆడుతుంటాయి. 
వెలుగు ఉన్నప్పుడు చీకటి ఛాయలు ఉండనే ఉండవు. 
అదేవిధంగా చీకటి రాజ్యమేలుతున్నప్పుడు వెలుతురు ఊసే ఉండదు. 
సుఖదుఃఖాలను వెలుగు చీకట్లతో పోల్చవచ్చు. 
ఒకటి( సుఖం లేదా దుఃఖం ) మన జీవితంలో ప్రవేశించినప్పుడు ఇంకొకటి (దుఃఖం లేదా సుఖం) మన దరిదాపుల్లో కానరాదు. 
ఒకటి తర్వాత ఇంకొకటి వస్తూ ఉంటేనే జీవితం విలువ మనకు తెలియవస్తుంది. 

✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము     18- 11- 2022
 #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #telugu #yqteluguquotes #yqtelugu

#జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #Telugu #yqteluguquotes #yqtelugu

7ad2858c12e045eb858b4a3b7dc87ebd

Narahari Rao

🌸🌸🌸 నరహరి నిత్య నిపఠము 🌸🌸🌸
4⃣3⃣4⃣

ప్రతిదానికీ వారి మీద వీరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం నీకు లేదు. 
నీలో అపారమైన శక్తి నెలకొని ఉంది. 
నీ స్వశక్తి ఏమిటో నీవేం చేయగలవో నిన్ను నీవు తరచి చూసుకొని తెలుసుకో. 
స్వయంశక్తిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే నీవు అద్భుతాలను సృష్టించగలవు. 
నీకు ఇష్టమైన విధంగా ఎవరికీ చెడు చేయని విధంగా బతికే పరిస్థితులను నీ చుట్టూ కల్పించుకో. 

✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము     17- 11- 2022 #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #telugu #yqtelugu #yqteluguquotes

#జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #Telugu #yqtelugu #yqteluguquotes

7ad2858c12e045eb858b4a3b7dc87ebd

Narahari Rao

एक जंग अपनों से 
और 
एक जंग अपने आप से 
लडते रहना
बहुत मुश्किल होता है। 
हर एक जंग में 
कामयाबी की उम्मीद लेकर 
चलते रहना है... 
जीवन की आखरी सांस तक।  ♥️ मुख्य प्रतियोगिता-1119 #collabwithकोराकाग़ज़

♥️ इस पोस्ट को हाईलाइट करना न भूलें! 😊

♥️ इस महीने दिल खोलकर लिखें। 😊

#एकजंगअपनोंसे #मुख्यप्रतियोगिता #KKC1119 #YQDIDI #कोराकाग़ज़  #YourQuoteAndMine
Collaborating with कोरा काग़ज़

♥️ मुख्य प्रतियोगिता-1119 #collabwithकोराकाग़ज़ ♥️ इस पोस्ट को हाईलाइट करना न भूलें! 😊 ♥️ इस महीने दिल खोलकर लिखें। 😊 #एकजंगअपनोंसे #मुख्यप्रतियोगिता #KKC1119 #yqdidi #कोराकाग़ज़ #YourQuoteAndMine Collaborating with कोरा काग़ज़

7ad2858c12e045eb858b4a3b7dc87ebd

Narahari Rao

🌸🌸🌸 నరహరి నిత్య నిపఠము 🌸🌸🌸
4⃣3⃣3⃣
ఏదైనా చేయడానికి ముందు బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాతే ఆచరణలో పెట్టాలి. 
నీవు ఏదీ ఆలోచించకుండానే అప్పటికప్పుడు అనుకొని చేసేస్తున్నావంటే అది నీ తొందరపాటుదనం. 
అలా చేసిన పనులకు ఫలితాలు సరిగ్గా అందుకోలేవు. 
నిరంతరంగా ఆలోచిస్తుంటేనే ఎంతో నేర్చుకోగలవు... కొత్త ప్రణాళికలకు సాకార రూపాలనివ్వగలవు.
నీవు క్రొంగొత్తగా ఏదీ ఆలోచించడం లేదంటే నీవసలు ఏమీ నేర్చుకోవట్లేదనే అర్థం. 

✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము
16- 11- 2022 #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #yqteluguquotes #yqtelugu #telugu #teluguquotes

#జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #yqteluguquotes #yqtelugu #Telugu #teluguquotes

7ad2858c12e045eb858b4a3b7dc87ebd

Narahari Rao

 🌸🌸🌸 నరహరి నిత్య నిపఠము 🌸🌸🌸
4⃣3⃣2⃣

ఎదుటివారు నిన్నర్థం చేసుకోవాలని... అందరికీ నచ్చేట్లు నీవు పనులు చేయాలని తాపత్రయ పడవద్దు. 
అందరూ ఎవరికి వారు వారికే సొంతమైన  గుణగణాలను కలిగి ఉంటారు... 
అందులో నీవు మరీ ప్రత్యేకమైన వ్యక్తివి. 
అందరికంటే ముందు నిన్ను నీవు అర్థం చేసుకో. 
నీ చుట్టుపక్కల పరిస్థితులకు తగ్గట్టుగా నిన్ను నీవు మలచుకో... తీర్చి దిద్దుకో. 
ఆ తర్వాత ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి... వారికి అర్థమవడానికి ప్రయత్నించు. 

✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము    15- 11- 2022 #telugu #teluguquotes #yqteluguquotes #yqtelugu #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు

#Telugu #teluguquotes #yqteluguquotes #yqtelugu #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు

7ad2858c12e045eb858b4a3b7dc87ebd

Narahari Rao

🌸🌸🌸 నరహరి నిత్య నిపఠము 🌸🌸🌸
4⃣3⃣1⃣
నీ జీవితం నీకు తెలియకుండానే మొదలైపోతుంది. 
ఎక్కడ ఎలా మొదలైందని పెరిగే కొద్దీ నీ జీవితం గురించి తెలుసుకుంటూ వస్తావు. 
అలాగే నీ జీవితం ఎక్కడ ఎలా అంతమవుతుందో నీకు తెలియదు... తెలుసుకోవాలని ప్రయత్నించినా తెలుసుకోలేవు. 
మధ్యలో జీవితం ఎలాంటి మలుపులు తిరగాలో ఏ గమ్యం చేరాలో అన్నవి మాత్రం నీ నిర్ణయాల ప్రకారమే జరిగేది. 
అందుకే నీవు ముందుచూపుతో సరైన నిర్ణయం తీసుకుంటేనే బంగారు భవిష్యత్తు నీదవుతుంది. 

✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము    14- 11- 2022 #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #telugu #teluguquotes #yqteluguquotes #yqtelugu

#జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #Telugu #teluguquotes #yqteluguquotes #yqtelugu

loader
Home
Explore
Events
Notification
Profile