Nojoto: Largest Storytelling Platform

Best గణపతి Shayari, Status, Quotes, Stories

Find the Best గణపతి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutగణపతి బప్పా మోరియా, గణపతి jagani, గణపతి స్తోత్రం, గణపతి, గణపతి ఆర్తి,

  • 1 Followers
  • 1 Stories

Naresh Reddy Aleti

#వినాయకచవితి #గణపతి #వన్నెలయ్య_వచన_కవిత

read more
కాపొల్ల గణపతి, మాలొల్ల గణపతి అంటూ
ఏ భేదం లేని వాడిలో ఇన్ని బేధాలు నేర్పిస్తుంటే
ఆ వీధిలోకి వెళ్ళలేకపోయా..

అదిగో ఆ గణపతి అరవై అడుగులంటూ
ఇదిగో ఈ గణపతి ఇరవై అడుగులంటూ
ఆద్యంతునిలో ఈ ఎత్తు తక్కువలు అర్థంకాక
ఖైరతాబాద్ వైపు చూడలేకపోయా..

సినిమా పాటలు పెట్టి కోటరు మీటరు పెంచి
సహస్రాక్షుడిని గుడ్డివాడనుకుంటే,
ఆ నవరాత్రులలో పాల్గొనలేక పోయా...

'లోకాస్సమస్తా సుఖినోభవంతు'
అని ప్రార్థించిన మహర్షుల బిడ్డలం మనం కాదా?
మరి.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను ప్రోత్సహించి
జీవుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంటే
ఆ నిమజ్జనంలో తడవలేకపోయా..

రంగుల పొంగుల మలిన దేహం ఎన్ని హంగులతో మెరిసినా, ఏనాటికైనా
కాల సంద్రంలోనే కలుస్తుందని తెలియజేస్తున్నా
తెలుసుకోలేకపోయా.. #వినాయకచవితి #గణపతి #వన్నెలయ్య_వచన_కవిత

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile