Nojoto: Largest Storytelling Platform

నిజాలు లేని అబద్దాలు ఎన్నో...! అబద్దాలు లో దాగిన అ

నిజాలు లేని అబద్దాలు ఎన్నో...!
అబద్దాలు లో దాగిన అనర్థాలు ఎన్నో...!
కాలం వెనుక కదిలిన కధలు ఎన్నో...!
ఆ కధలలో దాగిన కల్పితాలు ఎన్నో...!
వెలుతురు లేని వేకువ ఉందా..?
కలలే కనని కళ్ళు ఉన్నాయా...!
చీకటిలో దాగిన అందం విలువ వెలుగులో తెలుసునా...!
వెలుగులో మెరిసిన తారలు నింగిలో కనిపించేనా...!
బాధ లేని బతుకు ఈ లోకంలో ఒక భ్రమ అని తెలుసునా...!
ఎంత వాడు అయిన సరే అమ్మ దగ్గర ఒక అణువు అని తెలుసునా..!
ఈ క్షణం నీకు మరు క్షణమే గతం అని తెలుసునా...!
మన గతమే మన జీవితం అని తెలుసునా...!
ఏమి తెలుసు నీకు ... నీపై...ఈ లోకం పై...
మాయా లోకం ఇది... లేనంత వరకు అన్నిటి విలువ తెలిసికుంటారు.... కొంచెం చేతిలో సొమ్ము ఉంటే చాలు అన్ని విలువలను మరిచిపోతారు...
అప్పుడు బంధాలు బరువు అవ్వుతాయి....
మర్యాదలు మాయం అవ్వుతాయి... 
ప్రేమలు అన్ని పాత బడతాయ్...
గర్వం ఇంకా గర్జిస్తుంది...
వీడు మానవుడే... కానీ మహా మాయల కలిగిన రంగుల మార్చిన ఊసరవెల్లి మాంత్రికుడు కూడా...

©Made Santhosh
  #JEEVITAM