ఏ ఆర్భాటాలు కోరునే ఆ పైవాడు నీకై నువు మొక్కనిదే? లోపలున్నోడి ముడుపు చెల్లించుట కన్న బయటున్నోడి కడుపు నింపుటె మిన్న! మొక్కు తీర్చ నీ ఖర్చు ఉన్నోడి పర్సుకే చేరుతుంది తప్ప దేవుడేమి మూటగట్టుకోడు... ఆగమేఘాల మీద ఆ హుండీ చెంత వాలిపోడు... ఒప్పందం మనదే...బాధ్యత మనదే... తను కేవలం ప్రేక్షకుడే... మధ్యలో బ్రతికేది మాత్రం బడా బాబులే... మొక్కు తప్పని కాదు మొక్కు చెల్లించుకోడం అనివార్యమనీ కాదు