ఈ సముద్రరాళ్లేంటో కుప్పలుగా పడుంటాయి! అలలెన్ని లాక్కుపోదామని చుసినా కదలనంటాయి! ముక్కలవుతాయి కాని మారు మాట్లాడవేం? అబ్దాలు దశాబ్దాలై దశాబ్దాలు శతాబ్దాలై శతాబ్దాలు సహస్రాబ్దాలై కాల కడలిలో కలిసిపోతున్నాయి కాని వాటిలో లిఖించబడిన ఈ గత సౌరభపరాభవాలు మాత్రం అలానే ఉండిపోతున్నాయి చెదిరిపోయినా చిరాయువు పోసుకుని ఆ కడలి నడకలని గమనిస్తున్నాయి. #amaterasutelugu #yqkavi #teluguvelugu *************************** I was going through my old posts and stopped at #crazy_fusion and #fusion_style quotes that Chandra Mouli , Kiranmayi Bhamidimarri and I did long time ago. It's a memorable one and am already missing Kiranmayi's style here on YQ! (It's been almost an year)