సంస్థానం విలీనమే చరితలోన ఐక్యతా.! విద్వేషం కరగడమే భవితలోన ఐక్యతా.! ఎంత తీపి ఐతేనెం విధము తప్పి పోకూడదు చీమలెపుడు విడవవుగా నడకలోన ఐక్యతా! బలమవ్వని కులమెందుకు ఆపదలో నిలవనపుడు కాకులెపుడు మరవవుగా బాధలోన ఐక్యతా! తనదైనది పంచుకుంటు బ్రతికితేనె సార్థకతా కోడి ఐన వదలదుగా తినుటలోన ఐక్యతా.! భేదమింక తగదంటూ "ఉక్కు మనిషి" వన్నెలయ్య అడుగు వేసి చాటెనుగా జగతిలోన ఐక్యతా.! #వన్నెలయ్య_గజల్ 168 #గజల్ #గజల్స్ #తెలుగుగజల్ #ఉక్కుమనిషి #సర్దార్ #వన్నెలయ్య_స్మృతి #vallabhbhai జాతీయ ఐక్యతా దినోత్సవ శుభాకాంక్షలతో