ఆకాశం నుండి నేలకు ఈ నిచ్చెన ఎవరేసారబ్బ? మేఘాలయ్యిండొచ్చు...? కాదు.. ముత్యాల్లాంటి వర్షపు దారలుండగా వాటికెందుకు? ఆ నెలవంక వేసిందా..? పండు వెన్నెల్లుండగా దానికి ఏంపని? ఆ రవి కూడ అయ్యిండడు.. సాయంత్రం మొదలు ఈ సముద్రాలలోనేగా నిద్రపోయేది... ఈ పసిరిక వేసిందా? వేళ్ళు నేలను ముద్దాడుతువుంటె నింగినెలా అంటేది? ఏరా భైరవ నువ్వుకాని వేసావట్రా? ఔన్లే, కట్టేసుంటె నువ్వెలా వేస్తావ్..? ఓరే కనబడిందా? అమ్మో అమ్మ!! ఆ తెస్తున్నా అమ్మ రాత్రి పెరట్లో గొడబారు వేసి మర్చిపోయా నిచ్చెన... #telugu #teluguvelugu #yqkavi #fusion_style Kiranmayi Bhamidimarri tried your type of narrative style ;) :D unlike you, I couldn't keep it simple. Hope its not that bad!