Nojoto: Largest Storytelling Platform

మంచి చెడును వేరుచేసి కదిలెనుగా పరమహంస.! కళ్ళముందె

మంచి చెడును వేరుచేసి కదిలెనుగా పరమహంస.!
కళ్ళముందె సత్యాన్నీ చూపెనుగా పరమహంస.!

ఏ చదువు రాకుండా శాస్త్రాలే తెలుయుటెలా?
యద తలుపులు తెరవమనీ తెలిపెనుగా పరమహంస.!

వైకుంఠం కైలాసం పొందాలని కాంక్షేలా?
నీ చుట్టే మాదవుడట చాటెనుగా పరమహంస.!

ఇంత కొంత విద్వత్తుకె ప్రగల్భాలు ఎందరివో
ఆడంబర మసలు లేక నిలిచెనుగా పరమహంస.!

అణవు గుండె మహత్తెంతో చూపించెను విశ్వానికి
సింహంలా నరేంద్రున్ని మలిచెనుగా పరమహంస.!

రామకృష్ణ ప్రభోదాలు శారదమ్మ దీవెనలే
వన్నెలయ్య బాల్యమంత నిండెనుగా పరమహంస.! #వన్నెలయ్య_గజల్ 220 #గజల్ #రామకృష్ణ_పరమహంస  #రామకృష్ణ_పరమహంసజయంతి #వన్నెలయ్య_స్మృతి #ramakrishnaparamahamsajayanti